వంట సామగ్రి బహూకరణ
ఐ.పోలవరం: మురమళ్ల, పశువుల్లంక గ్రామ దేవత మాణిక్యాంబ అమ్మవారి ఆలయానికి ఓ భక్తుడు రూ.లక్ష విలువ చేసే వంట సామగ్రిని శనివారం అందజేశారు. పశువుల్లంక గ్రామానికి చెందిన దంతులూరి నరసింహరాజు (తాతరాజు), సుభద్ర, దంతులూరి సత్యనారాయణ వర్మ, సూర్యకుమారి సమకూర్చిన సుమారు వెయ్యి మందికి సరిపడా వంట సామగ్రిని ఆలయ కమిటీ సభ్యులు ధూళిపూడి చక్రం తదితరులకు అందజేశారు. ఈ సామగ్రి మహా శివరాత్రి మరుసటి రోజు నుంచి నెల రోజుల పాటు మాణిక్యాంబ అమ్మవారి ఆలయంలో ఉచిత అన్నదానానికి ఉపయోగ పడుతుందని కమిటీసభ్యులు తెలిపారు. జంప న భీమరాజు, దంతులూరి బుచ్చిబాబు పాల్గొన్నారు.


