తిరుమల ప్రతిష్టను పాడుచేసింది చంద్రబాబు ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

తిరుమల ప్రతిష్టను పాడుచేసింది చంద్రబాబు ప్రభుత్వమే

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

తిరుమల ప్రతిష్టను పాడుచేసింది చంద్రబాబు ప్రభుత్వమే

తిరుమల ప్రతిష్టను పాడుచేసింది చంద్రబాబు ప్రభుత్వమే

అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా ప్రాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ నేతలు, వారి ఇళ్లపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని రామారావు అన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఇటీవల టీడీపీ నాయకులు దాడి చేసి తప్పుడు పదజాలాన్ని ప్రయోగించి, పక్కా ప్లాన్‌ ప్రకారం ఆయన్ని రెచ్చగొట్టారని, తిరిగి ఆయనపైనే కేసులు, వారి ఇళ్లపై దాడులు, చేశారన్నారు. అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం అన్యాయమని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకుండా తిరుమల తిరుపతి ప్రతిష్టను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామారావు అన్నారు.

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement