పడవ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పడవ సీజ్‌

Feb 16 2026 7:39 AM | Updated on Feb 16 2026 7:39 AM

పడవ సీజ్‌

పడవ సీజ్‌

తాళ్లపూడి: అనుమతులు లేకుండా గోదావరి నదిలో పడవపై భక్తులను తరలిస్తున్న వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొవ్వూరు వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన నూకరాజు 15 మంది భక్తులను కొవ్వూరు గోదావరి మాత విగ్రహం సమీపంలో పడవలోకి రహస్యంగా ఎక్కించుకుని ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండా పట్టిసీమకు తీసుకు వెళ్తున్నాడు. తాళ్లపూడి ప్రాంతంలో పోలీస్‌ బీట్‌ సిబ్బంది ఆ పడవను అడ్డుకుని, నూకరాజును అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి పడవను సీజ్‌ చేసి, భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement