దక్కని ఆధరవు | - | Sakshi
Sakshi News home page

దక్కని ఆధరవు

Feb 6 2026 7:58 AM | Updated on Feb 6 2026 7:58 AM

దక్కన

దక్కని ఆధరవు

సాక్షి, అమలాపురం/ రావులపాలెం: జిల్లాలో కొబ్బరి, అరటి, వెనామీ రొయ్యల ధరలు పెరిగినా రైతులకు లబ్ధి చేకూరడం లేదు. మార్కెట్‌లో సరకుకు డిమాండ్‌ ఉండి మంచి ధర పలుకుతున్నా ఆ ఫలాలను అందుకోలేని స్థితిలో రైతులు ఉన్నారు. ఆశించిన స్థాయిలో ధరలు పెరిగినా దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం వల్ల గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొబ్బరికి మంచి రేటు

నాలుగు నెలలుగా ధర లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలిగిస్తూ గత నెల నాలుగో వారంలో కొబ్బరి ధరలు పెరిగాయి. అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కొబ్బరి వెయ్యికాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. గయర కాయ (పెద్ద కాయ) ధర రూ.21 వేల వరకు పెరిగింది. అడపాదడపా తగ్గుతున్నా డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లో ధర పెరుగుతోంది. పండగా సీజన్‌లు కావడంతోపాటు దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా కొబ్బరి డిమాండ్‌కు కారణం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. కొబ్బరి సగటు దిగుబడి ఎకరాకు 1,200 నుంచి 1,400 కాయలు. దిగుబడి ఏకంగా 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గి ఎకరాకు 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తున్నాయి. దీనివల్ల ధరలు పెరిగాయి. ధర పెరిగినా దిగుబడి తగ్గడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో పెరిగిన కొబ్బరి, అరటి,

వెనామీ రొయ్యల రేట్లు

అయినా రైతుకు లబ్ధి చేకూరని దుస్థితి

కొబ్బరి, అరటికి కలసి వచ్చిన

మహా శివరాత్రి, మాఘమాసం

కొబ్బరి వెయ్యికాయలు రూ.20 వేలు

40 శాతం తగ్గిన దిగుబడులు

కర్పూరం అరటి గెల రూ.700

రావులపాలెం మార్కెట్‌కు

వచ్చేది సగం గెలలు

వనామీ రొయ్యలకు అంచనాలకు

మించి ధర

ప్రస్తుతం పావు వంతు మాత్రమే సాగు

అరటికి డిమాండ్‌

మూడేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న అరటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటిదాకా నష్టాలను చూసిన రైతులు అరటి సాగు తగ్గించడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలకు ఉన్న పంట నేలకూలడం, మరికొంతమంది ప్రత్యామ్నాయంగా కంద, కోకో, పసుపు, కూర పంటల వైపు మొగ్గ చూపడం వంటి కారణాలతో దిగుబడి తగ్గింది. గతంలో జిల్లావ్యాప్తంగా 25,204 ఎకరాల్లో అరటిసాగు జరగగా ఇప్పుడు కేవలం 13 వేల ఎకరాల్లో మాత్రమే ఉందని అంచనా. విజయవాడ, గుంటూరు, కడప తదితర దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కూడా అరటి రైతులు మొక్కజొన్న, మిర్చి పంటల వైపు మొగ్గు చూపడంతో విస్తీర్ణం తగ్గింది. విజయనగరం, సాలూరు, పార్వతీపురం తదితర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గాలులకు అరటి చెట్లు పడిపోవడంతో స్థానిక అరటికి డిమాండ్‌ పెరిగింది. రావులపాలెం మార్కెట్‌ యార్డ్‌కు రోజుకు 25 వేల నుంచి 30 వేల అరటి గెలలు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 12 వేల గెలలు మాత్రమే వస్తున్నాయి. దీంతో అరటి గెలలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. గత నెలలో రూ.200 నుంచి రూ.300 వరకు ఉన్న కర్పూరం, చక్కర కేళి తెలుపు, ఎరుపు ధరలు ప్రస్తుతం అమాంతంగా రూ.700 నుంచి రూ.800 పలుకుతున్నాయి. అరటి ధరలు మార్చి నెల వరకు ఇలాగే ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మహాశివ రాత్రి, రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో పాటు, శ్రీరామనవమి, ఉగాది పండగలు ఉండడంతో ధరలు తగ్గే అవకాశం లేదంటున్నారు.

ధర ఉన్నా సరకు లేదు

గత మూడేళ్లుగా అరటికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ధర చుక్కలలో ఉన్నా సరకు లేదు. రైతులు అరటి పంటకు ప్రత్యామ్నాయంగా కంద వైపు వెళ్లడం ఈ పరిస్థితికి కారణం. ఏప్రిల్‌ నాటికి అరటి పంట అందుతుంది. అప్పటి వరకు పండగలు, పూజల కారణంగా మార్చి నెలాఖరు వరకు ధరలు తగ్గకపోవచ్చు.

– కోనాలా చంద్రశేఖర్‌ రెడ్డి,

అరటి వ్యాపారి, ఊబలంక.

వనామీ రేటు పెరిగినా..

వంద కౌంట్‌ (కేజీకి వంద రొయ్యలు) ధర ప్రస్తుతం రూ.250 వరకు ఉంది. ఇటీవల కాలంలో వంద కౌంట్‌కు ఈ ధర రావడం అరుదైన విషయమే. 90 కౌంట్‌ రూ.260 ఉండగా, 80 కౌంట్‌ రూ.280, 70 కౌంట్‌ రూ.310, 60 కౌంట్‌ రూ.330, 50 కౌంట్‌ రూ.350, 40 కౌంట్‌ రూ.380, 30 కౌంట్‌ రూ.480 వరకు ధరలు ఉన్నాయి. 30 కౌంట్‌కు ధర రూ.480 రావడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వెనామీ రొయ్యల కౌంట్‌కు మంచి ధర వచ్చింది. తరువాత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌ల కొరడాతో ధరలు పతనమయ్యాయి. అమెరికా టారీఫ్‌లు తగ్గించామని చె ప్పడానికి ముందే వనామీ రొయ్యలకు ఈ స్థాయి లో ధరలు ఉన్నాయి. కోనసీమ, కాకినాడ జిల్లాలో ని తీరాన్ని ఆనుకుని సుమారు 23 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతోంది. కానీ ప్రస్తుతం రైతు లు ఈ ఏడాది తొలి పంటకు సిద్ధమవుతున్నారు. మొత్తం సాగులో పావు వంతు అంటే సుమారు 6 వేల ఎకరాలలో మాత్రమే సాగు జరుగుతోందని అంచనా. రొయ్యల లభ్యత తక్కువగా ఉండడంతో ధరలు పెరగడానికి కారణమైంది.

ఎప్పుడూ ఇదే తీరు

వనామీ రొయ్యల పట్టుబడులు జరిగే సమయంలో వాటి ధరలు తగ్గడం, దిగుబడి తక్కువగా ఉన్న సమయంలో వాటి ధరలు పెరగడం సాధారణమైపోయింది. కొనుగోలుదారులు సిండికేటుగా మారడం వల్ల ఈ పరిస్థితి. ఇప్పుడు మార్కెట్‌కు రొయ్యల రాక తగ్గింది. దీని వల్లే రొయ్యల ధరలు పెరిగాయి.

– దంతులూరి నానాజీరాజు,

ఆక్వా రైతు, అన్నంపల్లి.

దక్కని ఆధరవు1
1/6

దక్కని ఆధరవు

దక్కని ఆధరవు2
2/6

దక్కని ఆధరవు

దక్కని ఆధరవు3
3/6

దక్కని ఆధరవు

దక్కని ఆధరవు4
4/6

దక్కని ఆధరవు

దక్కని ఆధరవు5
5/6

దక్కని ఆధరవు

దక్కని ఆధరవు6
6/6

దక్కని ఆధరవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement