సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

Feb 7 2026 10:14 AM | Updated on Feb 7 2026 10:14 AM

సిబ్బ

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

ఎస్పీ రాహుల్‌ మీనా

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో వినతుల స్వీకరణ

అమలాపురం టౌన్‌: పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్‌ శాఖ ప్రాధాన్యమిస్తుందని ఎస్పీ రాహుల్‌ మీనా అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, సర్వీస్‌ ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చినట్టు ఆయన తెలిపారు. వారి విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అలాగే వారి సంక్షేమానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్ల నుంచి కొందరు సిబ్బంది వచ్చి తమ వ్యక్తిగత సమస్యలు, వృత్తి పరమైన సమస్యలను ఎప్పీకి విన్నవించుకున్నారు.

పరీక్షలకు సిద్ధంకండి

పదో తరగతి విద్యార్థులకు ధైర్యం చెప్పిన డీఈవో నాగేశ్వరరావు

ఐ.పోలవరం: పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు సిద్ధంగా ఉండాలని డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. మండలం మురమళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలలో ఉత్తమమైన మార్కులు సాధించేలా వారికి పలు సూచనలిచ్చారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి విషయ నిపుణులతో మెళకువలు నేర్పించారు. ప్రముఖ సైకాలజిస్టు ఎన్‌.సన్‌ షైన్‌, విషయ నిపుణులు పాల్గొని జిల్లా లోని సీ, డీ గ్రేడ్‌లలో ఉన్న 3,600 మంది విద్యా ర్థులకు పరీక్షలకు తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్పించారు. ఎంఈవో వీధి సురేష్‌ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీఈబీ కార్యదర్శి బి.హనుమంతరావు, హెచ్‌ఎం ఎస్‌.సుజాత, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మనసు నియంత్రణతో

సానుకూల శక్తి

ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ శివాని

అమలాపురం రూరల్‌: మనసును నియంత్రించుకోవడం ద్వారా భావోద్వేగాలను సానుకూల శక్తిగా మార్చుకోవచ్చునని ఇంటర్నేషనల్‌ మోటివేషనల్‌ స్పీకర్‌ బీకే శివాని అన్నారు. శుక్రవారం రాత్రి కిమ్స్‌ కళాశాల ప్రాంగణంలో అమలాపురం బ్రహ్మకుమారీస్‌ హార్మొనీ హౌస్‌ ఆధ్వర్యంలో ఆమె ప్రసంగించారు. భావోద్వేగాలను సరైన మోతాదులో ప్రదర్శిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదని, వాటిపై నియంత్రణ లేనపుడే మనిషి విచక్షణ కోల్పోతాడని, తద్వారా క్షణికావేశంలో దారుణాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఇటువంటి భావోద్వేగ అవగాహన కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, జేసీ నిషాంతి, కిమ్స్‌ చైర్మన్‌ చైతన్యరాజు, ఆర్డివో కె.మాధవి, మెట్ల రమణబాబు, బీకే శ్రీదేవి, వంటెద్దు వెంకన్నాయుడు పాల్గొన్నారు.

అన్నదానానికి

రూ.1,67,126 విరాళాలు

ఆత్రేయపురం: వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి దాతలు రూ.1,67,126 విరాళాలు సమర్పించారు. అమలాపురం బసవ సత్య వెంకట సుబ్బారావు, దుర్గా దంపతులు రూ.50,116, అంకంపాలెం తవ్వ అరుణ్‌ కుమార్‌, సిరి దంపతులు రూ.66,892, హైదరాబాద్‌ నవీన్‌ కుమార్‌, నవత దంపతులు రూ.25,116, నూజువీడు వట్టికూటి చిరంజీవి కుటుంబం రూ.25వేల విరాళం అందించారు. వీరికి ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధరరావు, అర్చకులు, వేదపండితులు స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు, ఫొటోలు అందజేశారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం1
1/2

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం2
2/2

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement