నాసిరకం బియ్యం సరఫరా | - | Sakshi
Sakshi News home page

నాసిరకం బియ్యం సరఫరా

Feb 12 2026 7:39 AM | Updated on Feb 12 2026 7:39 AM

నాసిర

నాసిరకం బియ్యం సరఫరా

ముమ్మిడివరం: నాసిరకం బియ్యం సరఫరా కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కిరణ్‌ సూచించారు. ఆయన బుధవారం ముమ్మిడివరం మండలం అనాతవరం, భట్నవిల్లి అంగన్‌వాడీ కేంద్రాలను, రేషన్‌ షాపులను తనిఖీ చేశారు. అక్కడకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. విచారణ చేయగా మండల లెవెల్‌ స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇవే బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాగే ఐ.పోలవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో అన్నం ఉడక లేదని, కూరలు తినడానికి బాగోలేవ న్నారు. నాసిరకం బియ్యం సరఫరా, నాణ్యత లేని భోజనంపై విచారణ చేయాలని ఎంఈవోను ఆదేశించామన్నారు.

మందపల్లి మహా గణపతికి

పంచలోహ కవచం

కపిలేశ్వరపురం (మండపేట): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మందపల్లిలోని శనైశ్చరస్వామి దేవాలయంలో కొలువైన మహా గణపతికి విజయవాడకు చెందిన వాసా పల్లపురాజు పంచలోహ కవచం చేయించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్‌, సిల్వర్‌ వర్క్స్‌ శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్‌ చేతుల మీదుగా ఈ కవచం రూపుదిద్దుకుంది. దీన్ని గురువారం మందపల్లి ఆలయానికి తరలించనున్నట్టు దాతలు తెలిపారు.

సాక్షి, అమలాపురం: ఒక వైపు పల్లె పోరు (స్థానిక సంస్థల ఎన్నికలు)కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. దానిలో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. మరో వైపు ఆశావాహులు తమ పంచాయతీ సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఇంకో వైపు చంద్రబాబు ప్రభుత్వం స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు సిద్ధమవుతోందని విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాజాగా తిరుమల లడ్డూపై చంద్రబాబు, కూటమి నాయకులు చేసిన అసత్య ప్రచారం బెడిసి కొట్టింది. దీంతో మార్చిలో జరగాల్సిన పల్లె పోరుపై సందిగ్ధత నెలకొంది.

ఏప్రిల్‌ 2తో పాలన పూర్తి

రాష్ట్రంలో పంచాయతీల పాలనా కాలం ఏప్రిల్‌ రెండో తేదీ నాటికి ముగియనుంది. ఆ సమయానికి ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు తీసుకోవాలి. జిల్లాలో 342 పంచాయతీలున్నాయి. ఇప్పుడున్న వారి పదవీ కాలం ముగుస్తుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. పంచాయతీలలో ఓటర్ల జాబితాను మార్చి 9వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు, జిల్లాల పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అవసరాన్ని బట్టి 2026 జనవరి ఒకటో తేదీ అసెంబ్లీల ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అవసరమైన మేరకు పంచాయతీలలో వార్డుల విభజన ఈ ఓటర్ల జాబితాతోనే చేయాలని ఆదేశించింది.

ఆశావహుల సందడి

ఇదంతా ఎన్నికల సంఘం సహజంగా చేసే ప్రక్రియ. కానీ ఈ ప్రకటన చూసి ఆశావహులలో మాత్రం ఎక్కడా లేని సందడి నెలకొంది. టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి మరీ ఎక్కువైంది. నామినేటెడ్‌ పదవులను ఆశించి భంగపడిన వారందరూ సర్పంచ్‌, ఇతర స్థానిక సంస్థల పదవులపై భారీగా ఆశలు పెంచుకున్నారు. ఎంపీపీ, జెడ్పీటీసీల కాల పరిమితి సెప్టెంబర్‌లో గానీ పూర్తయ్యే అవకాశం లేదు. ఈ కారణంగా తొలుత సర్పంచ్‌ పదవులను కై వసం చేసుకోవాలని ఆశతో ఉన్నారు. ముఖ్యంగా మాచవరం, పి.గన్నవరం, తాటిపాక, రాజోలు, రావులపాలెం, కొత్తపేట, ద్రాక్షారామం, మురమళ్ల, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం వంటి మేజర్‌ పంచాయతీలు, బండారులంక, పేరూరు, కామనగరువు, ఈదరపల్లి వంటి పట్టణాలను ఆనుకుని, రియల్‌ ఎస్టేట్‌ పరంగా, ఇతర అభివృద్ధి చెందుతున్న పంచాయతీల్లో ద్వితీయ శ్రేణి ఆశావహుల సందడి అధికంగా ఉంది.

కూటమిలో నిరుత్సాహం

పల్లెపోరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి. ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్‌ను ఇప్పటికే సమాయత్తం చేయాలి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకున్నా, పార్టీకి చెందిన మద్దతుదారులు ఎక్కువ మంది గెలిచేలా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తాయి. ఇందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో గెలిచే అభ్యర్థుల మీద ఒక అంచనాకు వస్తాయి. కానీ ఇటు టీడీపీలోనూ, అటు జనసేనలోనూ ఎన్నికల ప్రస్తావనే లేదు.

ప్రభుత్వంపై వ్యతిరేకత

ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ధైర్యంగా లేదనేది నిజం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తోంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తొలి ఏడాది పాలనలో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. రెండో ఏడాది కొన్ని పథకాలు అమలు చేసిన లబ్ధిదారులకు భారీ గా కోత పెట్టింది. విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం, రైతులకు అందించిన అన్నదాత సుఖీభవ, మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌బండ్లు తదితర పథకాలు అమలు చేసినా, లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టిన విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలకు వెళితే చేదు ఫలితాలు చవిచూడాల్సి వస్తోందని ఎన్నికల వాయిదాకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.

వాయిదా వేసేందుకు..

ఎన్నికల ముందు కనీసం ఒకటి, రెండు పథకాల లబ్ధిని ప్రజలకు అందించకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని ఉద్దేశంతో ప్రభుత్వం ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తోందని సమాచారం. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారులను నియమిస్తారనే వార్త లు వస్తున్నాయి. ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి చూస్తుంటే ప్రత్యేక అధికారుల పాలన తప్పదని పంచాయతీరాజ్‌ శాఖలోని కీలక ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జనగణన మొదలు కానున్న నేపథ్యంలో దాన్ని బూచిగా ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉంది. కనీసం రెండు, మూడు నెలల పాటు జనగణన జరిగే అవకాశం ఉన్నందున జూలై వరకూ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఇదే జరిగితే సర్పంచ్‌ ఆశావహులకు నిరీక్షణ తప్పదు.

ఫ జిల్లాలో 342 పంచాయతీలు

ఫ ఏప్రిల్‌ 2 నాటికి

ముగియనున్న సర్పంచ్‌ల పాలన

ఫ మార్చి నెలాఖరు నాటికి ఎన్నికల

నిర్వహణకు కమిషన్‌ సన్నాహాలు

ఫ రిజర్వేషన్లపై ఆశావహుల లెక్కలు

ఫ ప్రజా వ్యతిరేకతతో

ఎన్నికలకు సిద్ధంగా లేని ప్రభుత్వం

నాసిరకం బియ్యం సరఫరా 1
1/3

నాసిరకం బియ్యం సరఫరా

నాసిరకం బియ్యం సరఫరా 2
2/3

నాసిరకం బియ్యం సరఫరా

నాసిరకం బియ్యం సరఫరా 3
3/3

నాసిరకం బియ్యం సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement