రాజకీయ విభేదాలతో దాడులు దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
● మాజీ మంత్రులు అంబటి రాంబాబు,
జోగి రమేష్ కుటుంబ సభ్యులకు
పరామర్శ
కొత్తపేట: రాజకీయ విభేదాలతో దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్మార్గం అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఇటీవల మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడి ఘటనలను ఆయన ఖండించారు. కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి జగ్గిరెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి, కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్టణంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకావాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, ముత్యాల వీరభద్రరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జవ్వాది రవిబాబు, కొవ్వూరి సుధాకరరెడ్డి, కోరిబాబు పాల్గొన్నారు.


