పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎస్పీ

Feb 11 2026 7:49 AM | Updated on Feb 11 2026 7:49 AM

పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎస్పీ

పుష్కర ఘాట్లను పరిశీలించిన ఎస్పీ

కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి ఫెర్రిలో గల పుష్కర ఘాట్లను మంగళవారం ఎస్సీ రాహుల్‌ మీనా పరిశీలించారు. ఈ నెల 15న జరగబోయే మహాశివరాత్రి నేపథ్యంలో ఎస్సీ మీనా పర్యటించి పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయం లోపల పక్కాగా క్యూ లు ఏర్పాటు చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు. డీఎస్సీ రఘువీర, ఎస్సైలు సోమేంద్ర, జానీ భాష, గ్రామపెద్దలు పప్పుల మసేను వెంకన్న(రేవు శ్రీను), సర్పంచ్‌ పెమ్మాడి బేబి సత్తిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement