డెల్టాకు ఈ నిధులు సరిపోవు
గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు ధవళేశ్వరం బ్యారేజీ దిగువున ఉంది. దీనిని స్థిరీకరిస్తూ లోయర్ రైపేరియన్ రైట్స్ కల్పించాల్సి ఉంది. దీనిని చూపించే పోలవరం నిర్మిస్తున్నారు. కాబట్టి డెల్టాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. బడ్జెట్‌లో డెల్టాకు రూ.రెండు వందల కోట్లు కేటాయించారు. ఈ నిధులు సరిపోవు. ఒక్క మురుగునీటి కాలువ వ్యవస్థకే రూ.300 కోట్లు ఉండాల్సి ఉంది. దీనికితోడు పంట కాలువల ఆధునీకరణకు నిధులు ఇవ్వాల్సి.
– తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, కన్వీనర్, భారతీయ
అగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్, అమలాపురం
ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. 12వ పీఆర్సీ ఊసేలేదు. ఉద్యోగులకు రూ.పదకొండు వందల కోట్ల బకాయిలు చెల్లించామని, కాగిత రహిత పెన్షన్ తీసుకు వస్తామని గొప్పలు చెప్పారు. ఇంకా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం, దానికి సంబంధించిన నిధులు, నాలుగు డీఏల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం దారుణం.
– ఎం.టి.వి.సుబ్బారావు,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇది నకిలీ బడ్జెట్
శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టింది ప్రజలను మోసం చేసే నకిలీ బడ్జెట్. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లలో కేటాయింపులు ఎక్కువ చూపించి ఖర్చు తక్కువ చేస్తున్నారు. రెవెన్యూ లోటు తగ్గించే రోడ్డు మ్యాప్ లేదు. భవిష్యత్తులో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు నిధులు కేటాయించి, 54 లక్షల రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఆడబిడ్డ నిధికి ఈ బడ్జెట్‌లోనూ మొండి చేయి చూపారు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఉద్యోగుల డీఏ బకాయిలు, ఐఆర్, పీఆర్‌సీ అంశాల ప్రస్తావన లేదు.
– బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
డెల్టాకు ఈ నిధులు సరిపోవు
డెల్టాకు ఈ నిధులు సరిపోవు


