నిరుద్యోగులను వంచించారు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులను వంచించారు

Feb 15 2026 6:56 AM | Updated on Feb 15 2026 6:56 AM

నిరుద

నిరుద్యోగులను వంచించారు

అధికారంలోకి వస్తే నెలకు రూ.మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క నెల కూడా నిరుద్యోగలకు భృతి ఇవ్వలేదు. ఇప్పుడు బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించలేదు. అంటే ఈ ఏడాది కూడా అందదన్నమాట. అసలు ఈ పథకం అమలు చేయబోమని చెప్పేస్తే సరిపోతుంది. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా లేకుండా పోయాయి.

– సత్తి నాగ పల్లారెడ్డి, రావులపాలెం

ఇక్కడి ఉద్యాన పంటలకు

గుర్తింపేది?

రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్‌ హార్ట్టికల్చర్‌ హబ్‌గా గుర్తించడం మంచిదే. కాని ఇంతకన్నా ఎక్కువ ఉద్యాన పంటలు సాగు చేసే గోదావరి జిల్లాలకు ఆ తరహా గుర్తింపు ఎందుకు ప్రకటించలేదు. కొబ్బరి, కోకో, పోక, అరటి, కంద, పసుపుతోపాటు వేలాది ఎకరాల్లో పువ్వుల సాగు, నర్సరీలు ఉన్నాయి. కోకో పంటను ఇప్పటి వరకు ఉద్యాన పంటగా గుర్తించలేదు. ఉద్యాన పంటలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వలేదు.

– ముత్యాల జమ్మీలు, నేషనల్‌ ప్లాంట్‌

హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యుడు, అంబాజీపేట

రైతులకు ప్రయోజనం లేదు

అన్నదాత సుఖీభవకు నిధులు ఇవ్వడం ఒక్కటే కాదు. రైతులకు మేలు చేయాల్సిన ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఉచిత పంటల బీమా ఎత్తివేయడం వల్ల గత ఏడాది వేలాది మంది రైతులు పంట నష్టపోయినా పరిహారం పొందలేకపోయారు. కనీసం పెట్టుబడి రాయితీ కూడా ఇవ్వలేదు. ఇటువంటి వాటికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు.

– ఇళ్ల సూర్యనారాయణ,

రైతు, శివల, కె.గంగవరం మండలం

నిరుద్యోగులను వంచించారు
1
1/3

నిరుద్యోగులను వంచించారు

నిరుద్యోగులను వంచించారు
2
2/3

నిరుద్యోగులను వంచించారు

నిరుద్యోగులను వంచించారు
3
3/3

నిరుద్యోగులను వంచించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement