రయ్‌రయ్.. దుమ్ము ఎగరెయ్
టిప్పర్ల వేగానికి లేచిన దుమ్ము
ఏడీబీ రోడ్డుపై ఒకేసారి మూడు టిప్పర్ల ప్రయాణం
రయ్ రయ్‌మంటూ ఒకే రోడ్డులో మూడు భారీ వాహనాలు వెళ్తూ జనానికి దడ పుట్టిస్తున్నాయి.. గండేపల్లి మండలం రామేశంపేట ఏడీబీ రోడ్డుపై గ్రావెల్ లోడుతో టిప్పర్లు ఒకదానికొకటి పోటీ పడి మరీ వెళ్తున్నాయి. ఒకే సమయంలో వేగానికి తోడు ఎదురెదురుగా తిరుగుతున్నాయి. ఈ టిప్పర్ల రాకపోకలతో దుమ్మూ ధూళిపైకి రేగడంతో దారి కనబడడం లేదు. అయినా ఇది అధికారుల కంట పడకపోవడం శోచనీయం. – గండేపల్లి
ఆగిపోయిన మోటార్ సైకిల్‌ను మరో వాహనంపై ఉన్న వ్యక్తి ఇలా నెట్టుకొచ్చారు. రాయవరంలో ఈ చిత్రం కంట పడింది. ఇంధనం లేక బైక్ మొరాయించడంతో వెనుక నుంచి మరో వాహనం ద్వారా కాలితో మోటార్ సైకిల్‌ను ఇలా నెట్టుకొచ్చారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందే కదా! – రాయవరం
రయ్‌రయ్.. దుమ్ము ఎగరెయ్


