స్కూటీపై నలుగురు ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

స్కూటీపై నలుగురు ప్రయాణం

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

స్కూట

స్కూటీపై నలుగురు ప్రయాణం

రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురికి తీవ్రగాయాలు

ఒకరికి స్వల్ప గాయాలు

అమలాపురం టౌన్‌: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఓ స్కూటీపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరికి స్వల్ప గాయమై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్‌ కథనం మేరకు కొత్తపేట మండలం వానపల్లికి చెందిన పలివెల నూకరాజు తన స్కూటీపై అతని కుటుంబీకులు కావ్య, మీనా కుమారి, వీర వెంకటలక్ష్మిలను తీసుకుని అమలాపురం వైపు నుంచి రాజోలు వెళ్తున్నాడు. అదే సమయంలో రాజోలు నుంచి అమలాపురం వైపు తీర్థయాత్రకు వెళ్తున్న మినీ బస్సు పేరూరు వై జంక్షన్‌ వద్ద వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నూకరాజు, మీనాకుమారి, వీర వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. క్షతగాత్రులు వై జంక్షన్‌లోని సాయి విశ్వాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్కూటీపై నలుగురు వెళ్లడం సరికాదని పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

కడియపులంకలో

అగ్ని ప్రమాదం

కడియం: మండలంలోని కడియపులంక కొబ్బరితోట కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.సత్తిరాజు ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌ చేయగా షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లోపు స్థానిక ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్‌ స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని అగ్ని మాపక శకటాన్ని పిలిపించగా ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగాల

సాధనకు బ్రాండ్‌ ‘శ్యామ్‌’

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఒక బ్రాండ్‌గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ అన్నారు. పోలీసు ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్‌– 2 ఉద్యోగాల్లోనూ శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్‌ అధినేత గుంటూరి శ్యామ్‌ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్‌ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్‌, డైరెక్టర్‌ శైలజ మాట్లాడుతూ పోలీస్‌ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్‌ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్‌–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్‌, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

స్కూటీపై  నలుగురు ప్రయాణం
1
1/3

స్కూటీపై నలుగురు ప్రయాణం

స్కూటీపై  నలుగురు ప్రయాణం
2
2/3

స్కూటీపై నలుగురు ప్రయాణం

స్కూటీపై  నలుగురు ప్రయాణం
3
3/3

స్కూటీపై నలుగురు ప్రయాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement