పల్లెవెలుగు మెట్లపై డోర్లు
అమలాపురం రూరల్: జిల్లా రహదారి భద్రత కమిటీ ఆదేశాల మేరకు ప్రయాణికుల రద్దీ, భద్రత దృష్ట్యా పల్లె వెలుగు బస్సు మెట్లపై డోర్ లేదా బద్దీ ఏర్పాటు చేయాలని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. డిపో మేనేజర్ శర్మతో కలిసి ఆదివారం పల్లెవెలుగు బస్సును పరిశీలించారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా ఒక బస్సుకు తలుపు లేదా సపోర్ట్ బద్దీ ఏర్పాటు చేస్తామని, సత్ఫలితాలిస్తే అన్ని బస్సులకు వాటిని బిగిస్తామని డిపో మేనేజర్ శర్మ తెలిపారు. ఈ అంశంపై జిల్లా రీజనల్ మేనేజర్, డిపో మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని డీటీఓ పేర్కొన్నారు. ఓపీఆర్‌ఎస్ ఇన్‌చార్జి నంది వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.
● ఏర్పాట్లకు డీటీవో పరిశీలన
● రహదారి భద్రత కమిటీ ఆదేశాలతో చర్యలు


