● మాకో మే...డ!
మనుషులకే కాదు మన్యంలో మూగజీవాలకూ మేడలు ఉంటాయి. ఆదివాసీలు తమ మేకలు, గొర్రెలను క్రూరమృగాలు, విష సర్పాల నుంచి రక్షించుకునేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. రాత్రిళ్లు అవి నివసించేందుకు మేడల మాదిరిగా ఎత్తయిన పాకలను నిర్మించి, దానికి అటక ఏర్పాటు చేస్తారు. అటకను సులువుగా ఎక్కేందుకు మెట్లు మాదిరిగా ఓ తడికెను నిర్మిస్తారు. ఉదయం మేతకు వెళ్లి సాయంత్రానికి ఆ పాకలో రాత్రుళ్లు విశ్రాంతి తీసుకుంటాయి. ఇది చింతూరు మండలం కొత్తూరులో ఆకట్టుకుంటోంది. – చింతూరు


