రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. రాజానగరం ఎంఎస్‌ఓ బాపిరాజు కథనం ప్రకారం.. వివిధ రంగుల్లో ఉన్న 311 ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన ఈ బియ్యాన్ని గోపాలపురం నుంచి రాజానగరానికి తరలిస్తున్నా రు. దీని విలువ రూ. 8,43,510 ఉంటుందని అంచనా. ఈ మేరకు గొల్లప్రోలుకు చెందిన లారీ డ్రైవర్, ఓనర్లు అల్లు శ్రీనివాస్, చోడిశెట్టి మహేష్‌లపై 6ఏ కేసు నమోదు చేశారు. బి య్యంతోకూడిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


