జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు వైష్ణవి
అంబాజీపేట: జాతీయ స్థాయి యూనివర్శిటీ తైక్వాండో పోటీలకు అంబాజీపేట శ్రీనివాస తైక్వాండో క్లబ్ విద్యార్ధిని కె.వైష్ణవి ఎంపికై నట్లు సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని వైష్ణవిని పలువురు గురువారం అభినందించారు. ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన వుమెన్స్ తైక్వాండో రాష్ట్ర స్థాయి ఎంపికలు జరిగాయని త్రిమూర్తులు తెలిపారు. 72 కేజీల విభాగంలో వైష్ణవి గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఒడిశా ఫకీర్ మోహన్ కాలేజీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గోనుందన్నారు.
పాఠశాలల్లో సమాజ
భాగస్వామ్యాన్ని పెంచాలి
– సమగ్ర శిక్షా ఏపీసీ మమ్మీ
అమలాపురం టౌన్: పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యాన్ని పెంచాలని డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీ పిలుపునిచ్చారు. స్థానిక విద్యానిధి పాఠశాల సమావేశపు హాలులో గురువారం జరిగిన విద్యాంజలి 2.0 జిల్లా స్థాయి ఒక రోజు ఓరియంటేషన్ క్లాస్‌లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాంజలి కార్యక్రమం రూపుదిద్దుకుందని వివరించారు. దాతలు, పూర్వపు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం విద్యాజంలి ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 1,561 పాఠశాలలు విద్యాంజలి భాగస్వామ్యం అవుతున్నాయి. సమావేశంలో సమగ్ర శిక్షా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బీవీఎస్ రంగారావు, డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశం, సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎస్‌వో కొమ్ముల నారాయణావు, రీసోర్స్ పర్సన్లు సీహెచ్ ఆంజనేయులు, ఏవీఎల్ నరసింహారావు విద్యాంజలి పోర్టల్‌పై అవగాహన కల్పించారు.
లక్ష్మీనరసింహస్వామి హుండీల
ఆదాయం రూ.56.10 లక్షలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీల ద్వారా రూ.56,10,249 ఆదాయం వచ్చినట్టు అమలాపురం ఎండోమెంట్స్ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు తెలిపారు. హుండీలను గురువారం లెక్కించినట్టు చెప్పారు. జనవరి 20వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 16 రోజులకు ఈ ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.54,83,401, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.1,02,679, అన్నదానం హుండీల ద్వారా రూ.24,169 వచ్చినట్టు ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ వివరించారు. 6.66 మిల్లి గ్రాముల బంగారం, 141 గ్రాముల వెండి వస్తువులు, పలు దేశాల కరెన్సీలు వచ్చాయన్నారు. ఎంపీటీసీ సభ్యుడు బైరా నాగరాజు, సూపరింటెండెంట్ పి.విజయ సారథి, సీనియర్ అసిస్టెంట్ ఎం.సత్యకిరణ్ పాల్గొన్నారు.


