మహిళ అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

మహిళ అదృశ్యం

Feb 10 2026 7:52 AM | Updated on Feb 10 2026 7:52 AM

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం

అనపర్తి: ఓ మహిళ అదృశ్యంపై సోమవారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్ర కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన గాజుల పాపారత్నం (45)కు మతిస్థిమితం లేదు. ఆమె భర్త చనిపోవడంతో అదే గ్రామంలోని తల్లి ఇంటి వద్దే ఉంటుంది. శనివారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో సోమవా రం ఆమె సోదరి చక్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపా రు. వివరాలు తెలిస్తే తన నంబర్‌ 94409 04851, అనపర్తి సీఐ సుమంత్‌ 94407 96538 ఫోన్‌ నంబర్లకు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement