సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

సమాజ

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు

అమలాపురం రూరల్‌: సమాజ భాగస్వామ్యాన్ని పెంచి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి గుబ్బల సూర్యప్రకాష్‌ అన్నారు. విద్యాంజలి 2.0 కార్యక్రమంపై అమలాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో పట్టణ, రూరల్‌ పరిధిలోని 105 ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శనివారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ సరేళ్ల దుర్గాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యాంజలిపై అవగాహన పెంచుకుని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రిసోర్స్‌ పర్సన్లు సీహెచ్‌వీ సతీష్‌, కె.కిషోర్‌ కుమార్‌, నోడల్‌ ప్రధానోపాధ్యాయుడు ఘన సత్యనారాయణ విద్యాంజలిపై అవగాహన కల్పించారు. దాతలతో పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు.

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు..

తాళ్లరేవు: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా, ఆత్మవిశ్వాసంతో చదవి తన తల్లి ఆశయాన్ని నెరవేర్చింది ఒక అమ్మాయి. తాళ్లరేవులోని అయినగడ్డవారి వీధికి చెందిన శేరు ప్రియాంక తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందారు. ఆమె తన అమ్మమ్మ అమ్మాజీ ఇంటి వద్ద ఉంటూ విద్యనభ్యసించింది. తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్న ప్రియాంక.. కాకినాడ పీఆర్‌ కళాశాలలో 2017లో డిగ్రీ పూర్తి చేసింది. అప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ గ్రూప్‌–2 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాలలో ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీ, అకౌంట్స్‌ విభాగంలో బీసీ వెల్ఫేర్‌ శాఖలో జూనియర్‌ అకౌంటెంట్‌గా ఎంపికై ంది. తాను ఈ ఘనత సాధించేందుకు అమ్మమ్మ, మావయ్యలు, పిన్ని, స్నేహితులు ఎంతో సహకరించారని ప్రియాంక తెలిపింది. తన తల్లికి తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడమంటే ఎంతో ఇష్టమని, ఆమె ఆశయం కోసం తాను కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించానని ప్రియాంక గర్వంగా తెలిపింది. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.

పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్‌

కాట్రేనికోన: మండలంలోని పి.లక్ష్మీవాడ జెడ్పీహెచ్‌ పాఠశాల హెచ్‌ఎం ఎస్‌.రాజేశ్వరీదేవిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్‌ చేశా రు. గతంలో అమలాపురం బాలుర హైస్కూల్లో పనిచేస్తున్న సమయంలో నిధుల దుర్వినియోగం చేసినట్టు ఆమైపె ఆరోపణలు వచ్చాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలను గుర్తించారు. అనంతరం శాఖా పరమైన పూర్తిస్థాయి విచారణలో నిబంధనలకు విరుద్ధంగా నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రాజేశ్వరీదేవిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సాలిడ్‌ వేస్ట్‌ డిస్పోజల్‌

ప్లాంట్‌ పరిశీలన

అమలాపురం టౌన్‌: అమలాపురం బైపాస్‌ రోడ్డుకు సమీపంలోని మున్సిపల్‌ డంపింగ్‌ యార్డులో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ప్లాస్మా టెక్నాలజీ సాలిడ్‌ వేస్ట్‌ డిస్పోజల్‌ ప్లాంట్‌ పనులను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. పనుల ప్రగతిపై అక్కడే అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌ కుమార్‌తో ఆయన చర్చించారు. ఈ ప్లాంట్‌ ద్వారా రోజుకు పది టన్నుల చెత్త డిస్పోజల్‌ అవుతుందన్నారు. పట్టణంలో సేకరించే చెత్తతో పాటు పరిసర గ్రామాల్లోని చెత్తను కూడా ఈ ప్లాస్మా ప్లాంట్‌కు తరలించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ప్లాంట్‌ ద్వారా చెత్తను సరికొత్త టెక్నాలజీతో శుద్ధీకరణ చేయడమే కాకుండా హానికర వ్యర్థాలను తగ్గించవచ్చన్నారు.

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు 1
1/3

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు 2
2/3

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు 3
3/3

సమాజ భాగస్వామ్యంతో విద్యార్థులకు సౌకర్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement