విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కళాశాల బస్సు
తప్పిన పెను ప్రమాదం
అమలాపురం రూరల్: ఓ కళాశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం ఉప్పలగుప్తం మండలం నుంచి అమలాపురంలో ఓ కళాశాలకు విద్యార్థులతో బస్సు వెళ్తోంది. సమనస వైన్ షాప్ సమీపంలో ఆ బస్సు అదుపుతప్పి పంట కాలువ వైపు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగా బయట పడ్డారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్ లైసెన్స్‌ను, బస్సు పర్మిట్‌ను మూడు నెలలు సస్పెండ్ చేశామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలోనే పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు సమావేశాలు నిర్వహిస్తామని డీటీఓ చెప్పారు.


