డ్రైవర్‌ ని అరెస్టు చేయాలని పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ ని అరెస్టు చేయాలని పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

డ్రైవర్‌ ని అరెస్టు చేయాలని పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన

మదనపల్లె టౌన్‌: భవన కార్మికుడు నాగార్జున మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం మదనపల్లి మండలంలోని వలసపల్లి గ్రామం, మొలకల దిన్నె గ్రామస్తులు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భం గా మృతుని బంధువు జ్యోతి మాట్లాడుతూ.. నాగార్జున స్వగ్రామం రామసముద్రం మండలం, మినికి అన్నారు. మదనపల్లిలో పనులు ముగించుకుని మొలకలదిన్నెలో ఉన్న అత్తగారి ఇంటికి బైకులో వస్తుండగా లారీని నిర్లక్ష్యంగా నడిపి నాగార్జున మృతికి కారకుడయ్యాడని చెప్పారు. అలాంటి వ్యక్తిని పోలీసులు పట్టుకోకుండా వదిలేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లారీ డ్రైవర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement