టమాటల తరలింపులో ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

టమాటల తరలింపులో ఘర్షణ

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

పుంగనూరు : పట్టణంలోని మార్కెట్‌ యార్డులో టమాటలు లారీలో తరలించే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు కత్తిపోట్లుకు గురైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మార్కెట్‌ యార్డులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు సురేష్‌, మాయ కన్నన్‌(45) టమాటలు తరలించే విషయంలో ఘర్షణ పడ్డారు. వీరి మధ్య మాటకుమాట పెరగడంతో డ్రైవర్‌ సురేష్‌ మరో డ్రైవర్‌ మాయకన్నన్‌ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, వ్యాపారులు వెంటనే సురేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాయకన్నన్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయం చేయాలని బాధితుడు వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement