ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్‌ ప్రారంభం

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

కడప ఎడ్యుకేషన్‌: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, పార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష(ఏపీఈఏపీసెట్‌)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్‌, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్‌ ఆధారిత(ఆన్‌లైన్‌)విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు.

జిల్లాలో 9 కేంద్రాల్లో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ

జిల్లావ్యాప్తంగా తొలిరోజు 1567 మంది హాజరు

Advertisement
 
Advertisement
Advertisement