మదనపల్లె టౌన్ : భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ యువకుడు విషపు ఆకులు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కుటుంబీకుల కథనం.. మదనపల్లె పట్టణం, నీరుకుటివారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న శివన్న (32)కు కర్ణాటకలోని మంచినీళ్ల కోట వద్ద కొంత ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే ఊరికి చెందిన కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. వారితో గొడవపడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న విషపు ఆకులు తిన్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.


