సాక్షి, మదనపల్లె: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం స్థానిక సుందరరాజు పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కె. మురళి మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌పై రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కె. మాధవ్ కుమార్, నాయకులు సురేష్, తిరుమలప్ప పాల్గొన్నారు.


