‘ఫేస్‌ ఐడీతో బురిడీ’పై కదలిక | - | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌ ఐడీతో బురిడీ’పై కదలిక

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

‘ఫేస్‌ ఐడీతో బురిడీ’పై కదలిక

మదనపల్లె టౌన్‌: ఫేస్‌ ఐడీతో మాయ చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. సాక్షి జిల్లా ఎడిషన్‌ గురువారం ప్రచురితమైన ‘‘ఫేస్‌ ఐడి తో బురిడీ’’కథనాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాఽ దికారి డా.లక్ష్మీ నరసయ్య స్పందించారు. ఈ నేపథ్యంలో మదనపల్లెలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యా లయంలో వివిధ ప్రోగ్రామ్‌ అధికారులతో, కార్యాలయ సిబ్బందితో డీఎంహెచ్‌ఓ అత్యవసర సమావేశం నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం, అలసత్వం, విధుల పట్ల బాధ్యతారాహి త్యం వహిస్తే సహించేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఫీల్డ్‌కు వెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మూవ్మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి పై అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే డ్యూటీ సమయాల్లో సిబ్బంది అందరూ తమ విధి స్థానాల్లో అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఎఫ్‌.ఆర్‌.ఎస్‌ హాజరు వ్యవస్థలో ఇన్‌ పంచ్‌, మిడ్‌ పంచ్‌, ఔట్‌ పంచ్‌లను తప్పనిసరిగా సంబంధిత విధి ప్రాంతాల్లోనే నమోదు చేయాలని, ఎటువంటి అక్రమాలు, తప్పుడు హాజరు నమోదులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement