బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు | - | Sakshi
Sakshi News home page

బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

రాయచోటి టౌన్‌ : రాయచోటి పట్ణణంలోని గున్నికుంట్ల రోడ్డులో సమాధులకు దగ్గరగా ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉండటంతో తెల్లవారు జామున అటువైపు వెళ్లే పాదచారులు ( వాకింగ్‌) భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు అ దిశగా వెళ్లడం మానేశారు. ఇది ఇలా ఉండగా రాయచోటి పట్టణంలోని పట్టణ వైద్యారోగ్య కేంద్రం ( ఐదు పైసలు బావి) దగ్గరగా గత రాత్రి ఎవరో చేతబడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారి ఆ దారిలో నడిచి వెళ్లే ( వాకింగ్‌) వారికి, క్రికెట్‌ ఆడకొనేందుకు వెళ్లే కుర్రాళ్లకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక్క సారిగా భయంతో ఆ వైపు వెళ్లేందుకు జంకుతూ వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement