కలకడ : సెన్సెస్–2027 కార్యక్రమం నాలుగురోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా ఇన్‌చార్జ్ విష్ణుప్రియ ఆదేశించారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో డీడీఓ లక్ష్మిపతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. హౌసింగ్ ఆపరేషన్ పూర్తి చేసి, ఎన్యుమనేటర్‌లు, సూపర్‌వైజర్లు మిగిలిన డోర్‌లాక్ కుటుంబాలను మరొక్కమారు విజిట్ చేసి వివరాలు సేకరించాలని ఆదేశించారు. తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎంపీడీఓ భానుప్రసాద్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్‌విష్ణుప్రియ


