మదనపల్లె టౌన్ : మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుంగనూరు మండలం, పాలెంపల్లి పంచాయతీ, కుక్కలపల్లికి చెందిన రామకృష్ణ కుమారుడు గంగరాజు (24) అంగళ్లు మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉన్న తన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్‌లో ఉన్నాడు. అతని ఇంటికి వచ్చిన గంగరాజు స్నేహితునితో మిద్దైపెకి వెళ్లి మాట్లాడు తుంటుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికి పరి స్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.
అనుమానస్పద స్థితిలో
యవకుడు..
కేవీపల్లె : అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి చెందిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కరణంవారిపల్లె సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ వెంకటశివకుమార్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కరణంవారిపల్లె సమీపంలోని ఓ మామిడి తోటలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృత దేహం కుళ్లిన స్థితిలో ఉంది. అక్కడ లభించిన ఆధారాలతో సుండుపల్లె మండలం ముడుంపాడు నగిరికి చెందిన మల్లిఖార్జున నాయుడు (35)గా గుర్తించారు. ఐదు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


