ముగిసిన ఉరుసు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉరుసు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

ముగిసిన ఉరుసు

పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్‌ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. చివరిరోజు ఆదివారం రాత్రి ముస్లిం పెద్దలు, హజరత్‌లు దర్గాలోని మజార్‌పై చాదర్‌, పూలు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను విద్యుత్‌ దీపాలతో సుందరంగా అలంకరించారు.నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి మధ్య ఖవ్వాలి ఆద్యంతం భక్తులను ఆలరించింది. ఉరుసు సందర్భంగా దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మదనపల్లె డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement