కడప ఎడ్యుకేషన్: కడపలోని సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 9.30 గంటలకు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల వ్యవహారంపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం సొసైటీ చేసిన, చేస్తున్న కృషి, అవరోదాలు,లబ్ధిదారుల అపార్థాలు,అభియోగాలు అన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరు కావాలని వారు కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు.


