క్వారీ యజమాని నిర్లక్ష్యానికి కార్మికుడు బలి | - | Sakshi
Sakshi News home page

క్వారీ యజమాని నిర్లక్ష్యానికి కార్మికుడు బలి

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

పుంగనూరు : క్వారీలో పని చేస్తున్న కార్మికుడిపై బండరాళ్లు పడటంతో గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాలెంపల్లెకి చెందిన క్వారీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్‌నాయక్‌(35) క్వారీ కింద భాగంలో డ్రిల్లింగ్‌ చేస్తున్నాడు. పైన బండరాళ్లను క్రేన్లతో లారీలోకి ఎక్కిస్తుండగా రాళ్లు పడటంతో జనార్ధన్‌నాయక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్వారీ యాజమాన్యం సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం, కార్మికులకు ఇన్సూరెన్స్‌ లేకపోవడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండరాళ్లు పడటంతో మృతి

Advertisement
 
Advertisement
Advertisement