గాలివీడు: జిల్లాలో నిత్య పూజలకు నోచుకోని పురాతన దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని మంజూరు చేస్తోందని జిల్లా దేవాదాయ శాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు, శుక్రవారం తలముడిపి గ్రామంలోని శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఈ ఆలయానికి పథకం మంజూరైనట్లు వెల్లడించారు. గోపురం, మూలవిరాట్, ధ్వజస్తంభం ఉన్న పురాతన ఆలయాలకే ఇది వర్తిస్తుందన్నారు.
మదనపల్లె టౌన్: జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శనివారం మదనపల్లెలో నిర్వహించబోయే డెంగ్యూ అవగాహన ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మలేరియా విభాగం సిబ్బందితో కలిసి డెంగ్యూ నిర్మూలన కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.


