కన్నీటి మడుగు | - | Sakshi
Sakshi News home page

కన్నీటి మడుగు

May 12 2026 5:42 AM | Updated on May 12 2026 5:42 AM

గాలివీడు : మండలం పరిధి గండిమడుగులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మతి చెందాడు.పోలీసుల కథనం మేరకు.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి గ్రామానికి చెందిన షేక్‌ నాసిర్‌ (25) వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గండిమడుగు వద్ద ఉన్న వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం గండిమడుగులో ఈత కొట్టేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగి పోయాడు. యువకుడు నీటిలో కనిపించక పోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్‌ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

ఈతకు వెళ్లి యువకుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement