పేద ప్రజలపై భారం మోపుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై, వాహనదారులపై ఈ వడ్డన అన్యాయం. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, మార్కెట్లో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. – పి. ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ యూత్
జిల్లా వైస్ ప్రెసిడెంట్, కేవీపల్లె.
సామాన్య, మధ్య తరగతిపై ప్రభావం
డీజిల్ పెంపు వాహనదారులకే కాకుండా దీని ప్రభావం సామాన్య మధ్య తరగరతి వారిపై కూడా పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. చిన్న వ్యాపారులు, వాహనాలపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఇబ్బందే. జీవన వ్యయం పెరుగుతుంది. –సునీల్, భవరధయ్యగారిపల్లి,
కురబలకోట మండలం
ట్రాక్టర్ యజమానులకు భారం
నాకు ట్రాక్టర్ ఉంది. ఎక్కువగా వ్యవసాయ పనులతో పాటు రవాణా పనులపై వెవెళుతుంటా. పెరిగిన రేట్లతో డీజిల్ ఖర్చు ఎక్కువ వస్తుంది. దీంతో దున్నకం, లోడింగ్, రావాణా చార్జీలు పెంచక తప్పదు. దీని వల్ల రైతులపై అదనపు భారం పడుతుంది. వ్యవసాయ ట్రాక్టర్ రైతులకు డీజిల్ రేట్ల నుండి ఊరట కల్పించాలి.
–మారసాని రామ్మోహన్ రెడ్డి,
ట్రాక్టర్ నిర్వాహకులు,
కనసానివారిపల్లి, కురబలకోట మండలం


