సాక్షి, మదనపల్లె: పీకేఎం ఉడా పరిధిలో అనుమతి లేకుండా లే అవుట్లను వేసిన వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేయాలని సంస్థ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం ఉడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని గుండ్లసాగరం పంచాయతీలో ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా లే అవుట్, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లే అవుట్ ప్లానులు, వీటికి కావాల్సిన అంచనాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కుప్పంలో నాలుగు, ములకలచెరువులో ఒకటి అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి రూ.52.54 లక్షలను ప్రజారోగ్య శాఖకు చెల్లించామని వెల్లడించారు. సమావేశంలో సెక్రటరీ పీఆర్.మనోహర్, పరిపాలనాధికారి చిట్టిబాబు, ప్లానింగ్ అధికారి, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ప్లానింగ్ సెక్రటరీలు హాజరయ్యారు.
సమీక్షలో జేసీ శివ్ నారాయణ్ శర్మ


