సాక్షి ప్రతినిధి కడప: పచ్చ కామెర్లకు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఎల్లో మీడియా తన పైత్యాన్ని అనునిత్యం ప్రదర్శిస్తుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి కడప నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రోగుల సహాయకులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.1.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి భవనం, వసతి, డైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2019 నుంచి ఆరేళ్లుగా నిరాటంకంగా రోగుల సహా యకులకు భోజన వసతి కల్పించామన్నారు. ప్రతిరోజు ఉదయం 350–450 మంది వరకు, సాయంత్రం 220–250 మంది వరకు భోజనం చేసేవారన్నారు. తమ సిబ్బంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరితో వసూలు చేయకుండా, ముందస్తు టోకన్లు జారీ చేసి ఉచిత భోజనం కొనసాగించామని వివరించారు. ఆరేళ్లుగా నిరాంటకంగా ప్రతిరోజు భోజన వసతి దాదాపు 700 మందికి కల్పిస్తుంటే, ఒక్కరోజుగా గుర్తించని ఈనాడు పత్రిక ఎల్లో పైత్యాన్ని ఎక్కించుకుని అడ్డగోలు రాతలు రాసిందని మండిపడ్డా రు. అక్కడ నియమించిన మేనేజర్ భోజన, వసతిలో తప్పిదాలు చేయడం వల్ల తొలగించామన్నా రు. సిబ్బంది సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. దానిని పట్టుకుని ఈనాడు తన పైత్యాన్ని ప్రదర్శించిందని ధ్వజమెత్తారు.
ఛారిటబుల్ ట్రస్టుపై ఈనాడు అడ్డగోలు రాతలు
ఆరేళ్లుగా నిరాటంకంగా రెండు పూటల భోజనం
డైలీ 700 మందికి భోజన ఏర్పాట్లు
ఈనాడు రాతలపై మండిపడ్డ పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి


