కడప ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2026 నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్‌లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. వైఎస్సార్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 14846 మంది ఇంజనీరింగ్‌కు, 3985 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా...
ఏపీ ఈపీపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఆరు, ప్రొద్దుటూరులో రెండు, రాజంపేటలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని సిద్ధం చేశారు.
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


