కలెక్టర్ నిశాంత్ కుమార్
సాక్షి, మదనపల్లె: ద్విచక్ర వాహనాలకున్న సైలెన్సర్లను తొలగించి, వాటి స్థానంలో అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం హెచ్చరించారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాహనాలకు అనధికారికంగా మార్పులు చేయడాన్ని అరికట్టేందుకు మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల మెకానిక్ వర్క్‌షాప్‌లపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు దినేష్ చంద్ర, శివలింగ, శ్రీహరిలు మెకానిక్ షాపులు, షోరూంలో తనిఖీలు చేసి సైలెన్సర్లను మార్పులు చేయరాదని స్పష్టం చేశారు. అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో 12 వర్క్‌షాప్‌లను తనిఖీ చేయగా, వాటిలో మూడు వర్క్‌షాపుల్లో వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా మార్పు చేసిన సైలెన్సర్లు అమర్చిన విషయాన్ని గుర్తించారు. ఇకపై అనధికారిక మార్పులు చేయరాదని ఆదేశించారు.


