● గ్రామీణ బ్యాంకులో ఘటన
● రూ:5200 నగదు అపహరణ
● లబోదిబో మంటున్న బాధితురాలు
చౌడేపల్లె: ఓ మహిళ బ్యాంకులో తను డ్రా చేసుకున్న డబ్బును లెక్కపెట్టుకుంటుండగా .. ఓ వ్యక్తి వచ్చి నేను లెక్కపెట్టి ఇస్తాను అని ఆ డబ్బు లెక్కపెడుతూ అందులో కొంత నొక్కేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం గ్రామీణ బ్యాంకులో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికు చెందిన తలారి పద్మావతమ్మ దుర్గా మహిళా సంఘం సభ్యురాలు. పొదుపు ఖాతాలో అప్పు రూ.30 వేలు కోరగా సభ్యుల తీర్మాణం మేరకు పద్మావతి వ్యక్తి గత ఖాతాకు రూ:30వేలు సొమ్ము జమఅయింది. కాగా ఈ సొమ్మును శుక్రవారం డ్రా చేసుకొనేందుకు వచ్చింది. డ్రా చేసుకొన్న సొమ్మును బ్యాంకులో కూర్చొని లెక్కిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి నేను డబ్బు లెక్కపెట్టి ఇస్తాను అంటూ ఆమె వద్ద తీసుకుని క్షణాల్లో రూ.5200 నొక్కేసి అక్కడనుంచి ఉడాయించాడు. కాసేపటి తరువాత డబ్బులు లెక్కించగా తక్కువగా ఉండడంతో లబోదిబో మంటూ బాధిత మహిళ బ్యాంకు సిబ్బందికి మొరపెట్టుకొంది. బ్యాంకులోని సీసీ పుటేజీలు పరిశీలించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కాగా అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం, లెక్కించమని చెప్పకూడదని.. మహిళలు బ్యాంకులకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలతోపాటు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప హెచ్చరించారు.


