నిధులున్నా.. నిర్వహణ లేక | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నిర్వహణ లేక

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

నిధులున్నా.. నిర్వహణ లేక

దనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూ.228 కోట్లు. అంటే ఆర్థికంగా ఎంతో పరిపుష్టి కలిగిన మున్సిపాలిటీ అనేది అందరికీ అర్థమవుతుంది. అయితే మున్సిపల్‌ పరిపాలన భవనం మాత్రం అధ్వానంగా ఉంది. కనీస నిర్వహణ లేదు. వర్షం వస్తే ఉరుస్తుంది. స్లాబ్‌ పెచ్చులు ఉడుతున్నాయి. పెయింటింగ్‌ కూడా లేకపోవడంతో పెచ్చులకు వేసిన సున్నం ఊడి పడుతోంది. అధికారుల స్థాయికి తగ్గట్టుగా కనీస చాంబర్లు. భవనానికి మరమ్మతులు, నిర్వణ లేకపోవడంతో కనీసం రంగులు వేయించడం లేదు. దాంతో ఇది సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ అన్న పేరు గొప్ప అయినా.. పరిపాలన భవనం మాత్రం నగర పంచాయతీ స్థాయికి తగినట్టుగా ఉంది. ఇప్పటికై నా దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –సాక్షి, మదనపల్లె

Advertisement
 
Advertisement
Advertisement