పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలం వగళ్ళవారిపల్లె సమీపంలోని శ్రీయల్లమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి ఆలయంలోని హుండీ చోరికి యత్నించి ఆ సమయంలో ఇతరుల రాకతో హుండీ వదిలేసి ప్రహరీ దూకి దుండగుడు పరారయ్యాడు. వివరాలు... శ్రీయల్లమ్మ దేవాలయం కొత్తగా నిర్మించారు. గోటూరి మురళీ మోహన్‌రెడ్డి ఆలయ చైర్మన్‌గా ఉన్నారు. గతనాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి మాస్కు,గ్లౌజులు వేసుకొని హుండీ చోరీకి ప్రయత్నించారు. వీలుకాక పోవడంతో వదిలేసి పోయాడు. ఈ విషయం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. తిరిగి మళ్లీ వస్తాడన్న ఉద్దేశ్యంతో గురువారం రాత్రి చైర్మన్ మురళీ మోహన్‌రెడ్డి ముందు జాగ్రత్తగా కొందరిని గుడిపక్కన ఉన్నగదిలో ఉంచాడు. అదేరాత్రి దుండగుడు 12.30 గంటల సమయంలో గుడిలోకి రావడం, హుండీ తస్కరించి ప్రహరీ వైపు దూకి బయటకు వెళ్లే సమయంలో గుడి చైర్మన్ మురళీ మోహన్‌రెడ్డి పక్కనే ఉన్న తన ఇంటి నుంచి రావడం గట్టిగా అరవడం, పట్టుకోవడానికి ప్రయత్నించగా హుండీ అక్కడే వదిలేసి ప్రహరీ దూకి పరారయ్యాడు. దీనిపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు వెంటనే క్లూస్ టీంని పంపారు. రెండు సార్లు హుండీ లో డబ్బు కోసం వచ్చిన వాడు ఒకరేనా తెలియాల్సి ఉంది. పోలీసు విచారణలో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. కల్లూరు ఏఎస్‌ఐ సత్యనారాయణ, క్లూస్ టీం ఏఎస్‌ఐ రమేష్, కల్లూరు ఎస్‌బీఐ కానిస్టేబుల్ రఘు పాల్గొన్నారు.


