ఒంటిమిట్ట (సిద్దవటం): మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా నెల రోజులకుగాను భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.7,72,930ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న హుండీల సొమ్మును గురువారం లెక్కించారు. ఇందులో బ్రహ్మంగారిమఠంలో హుండీల ద్వారా రూ. 37,55,769 , పోలేరమ్మ గుడి దగ్గర గల హుండీ ద్వారా రూ. 2,74,699 లక్షలు. నాలుగు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అధికారి శంకర్ బాలాజీ, మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, మఠం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పీలేరు: రైతులు వ్యవసాయానికి రథసారథుల ని జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ శివనారనాయణ, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.వి.ఎస్. నాయుడు అన్నారు. గురువారం శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై అవగాహన, అనుభవం కోసం వేలపులబైలు రైతు సేవా కేంద్ర పరిధిలో క్షేత్రస్థాయి వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహ న కల్పించారు. కలికిరి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కె. మంజుల, ఎస్‌వీ వ్వసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ చలం, అసోసియేట్ డీన్ ప్రతినిధి డాక్టర్ నాగమణి, జిల్లా డీపీఎం వెంకటమోహన్, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సాక్షి, మదనపల్లె: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా, పోస్టల్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. మొదటి సంవత్సర పరీక్షలకు 9,274 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షకు 5,558 మంది, వోకేషనల్ 1,125 మంది హాజరవుతారని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లో అనుమతించేదిలేదని స్పష్టం చేశా రు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలపై కంట్రోల్ రూమ్ నెంబర్ 9866112750కు తెలియ జేయాలన్నారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవి, డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ శాఖ డీఈఈ శ్రావణి, సర్వశిక్ష అభియాన్ అధికారిని డీపీఎమ్‌ఓ రమే ష్ బాబు, ఆర్టీసీ డీఎం ఎంవీఆర్.రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు.


