భక్తిలో మునిగారు | - | Sakshi
Sakshi News home page

భక్తిలో మునిగారు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

గుప్త నిధుల కోసం..

ఆలయం లేదు..మూలవిరాట్టులు లేరు..ఆలయం సోమశిల వెనుక జలాల్లో మునిగింది..అయినా గ్రామస్తులు ఏటా ఉత్సవ విగ్రహాలతో కల్యాణం చేయించి.. భక్తిపారవశ్యంతో పరమానందం పొందుతున్నారు.. అదెక్కడో కాదు..సోమశిల బ్యాక్‌వాటర్‌ పరీవాహక గ్రామం యల్లంపేట. దీనిపై ప్రత్యేక కథనం..

రాజంపేట: అది సోమిశిల వెనుకజలాలల్లో మునిగి పోయిన గ్రామం..యల్లంపేట .. చుట్టూ పచ్చటి పొలాలు..ఆహ్లాదకరమైన వాతవరణం. ఏరు ఉంటుంది. ఈ గ్రామంలో అప్పట్లో 300 కుటుంబాలకుపైగా నివాసం ఉండేవారు. యల్లంపేట, ఓబులంపేట రెండు గ్రామాలు ఉండేవి.ఈ గ్రామానికి చెందిన ఆలయం మునకలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులకు పునరావాసం లేదు..ఆలయం నిర్మించలేకపోయారు. గ్రామంలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీమంత్రి బండారు రత్నసభాపతి(ఓబులంపేట), ఎమ్మెల్యే లేని రోజుల్లో జిల్లా డిస్ట్రిక్‌బోర్డు మాజీ సభ్యుడు తాండ్ర పేరమనాయుడు (యల్లంపేట) పెద్ద కుటుంబాలు ఉండేవి.

● సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఇప్పటికీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయి, గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించగానే అధ్యాత్మికభావన మనుసులో పుట్టుకొస్తుంది.

ప్రతి ఇంటిలో ఒకరికి స్వామిపేరు..

శ్రీ రుక్మిణి, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామిపై అపారమైన భక్తి భావం, ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ క్రమంలోని యల్లంపేటలో ప్రతి ఇంటిలో ఒకరికి స్వామి పేరుపెట్టుకోవడం గమనార్హం. ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఒక్కటిగా స్వామి వారి ఎదుట కలుసుకొని పరస్పరం సంతోషాలతో గడుపుతారు. భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తారు.

సోమశిల బ్యాక్‌వాటర్‌ మునిగిన యల్లంపేట రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, యేటా గ్రామస్తులు నిర్వహించే కల్యాణంలో ఉత్సవమూర్తులు

వేణుగోపాలస్వామిపై తరగని భక్తి

గ్రామం మునిగిపోయి నాలుగుదశాబ్దాలు దాటుతున్నా యల్లంపేట వేణుగోపాలస్వామిపై భక్తిభావం తరగలేదు. ఆలయం మునిగిపోయింది, గ్రామం ఖాళీ అయింది. యల్లంపేటకు పునరావాసం లేదు. ప్రభుత్వాలు ఆలయం నిర్మాణంతోపాటు పునరావసం కల్పిస్తే, మళ్లీ గ్రామస్తులు ఒక్కచోట కలిసి ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. –తాండ్ర రమేష్‌నాయుడు,

యల్లంపేట, నందలూరు

● సోమశిల బ్యాక్‌వాటర్‌లో యల్లంపేట గ్రామంతోపాటు ఆలయం మునకకు గురైంది.

● గ్రామానికి 1986 ప్రాంతంలో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టారు. 1990 నుంచి గ్రామాన్ని దశలవారీగా ముంపువాసులు వదలివెళ్లారు. తమకు అనుకూలమైన ప్రాంతాలకు, రాష్ట్రంలో నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు.

● గ్రామం ఖాళీ అవుతున్న క్రమంలో, మరోవైపు నీళ్లు గ్రామానికి చేరువలో రావడంతో మానవసమాజం ఆలయానికి దూరమైంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా ఆలయాన్ని తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ఊరేగించే వాహనాలు, పంచలోహ విగ్రహాలు మాత్రం మిగిలాయి.

● దొరల కాలంలో యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మితం చేశారు. ఆలయంలో రాతి విగ్రహామూర్తులు ఉండేవి. అయితే ఇక్కడ ఎక్కడాలేని విధంగా చెక్క విగ్రహాలే మూలవిరాట్టులు చేసి, పూజలు నిర్వహించేవారు. పంచలోహవిగ్రహాలే ఉత్సవ మూర్తులుగా నిర్వహించేవారు. ఏటా పెద్దఎత్తున యల్లంపేట తిరునాల జరిగేది. 8రోజుల పాటు తిరునాల నిర్వహించేవారు.

● ఆలయానికి సోమశిల నష్టపరిహారం చెల్లించారు. రెవెన్యూ డిపాజిట్‌ చేశారు. అప్పట్లో రూ.80లక్షలు ఉన్నట్లు సమాచారం.

● గ్రామాన్ని వదలివెళ్లినప్పటికి గ్రామస్తులు ఏటా శ్రీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం రోజున అందరూ ఏకమవుతారు. గ్రామంలేకున్నా స్వామిని మాత్రం భక్తులు మరవేలదనడానికి ఇదే నిదర్శనం. మొన్నటి వరకు ఒంటిమిట్ట రామాలయంలో..ఇప్పుడు సౌమ్యనాథాలయం(నందలూరు)లో పంచలోహ విగ్రహాలు భద్రపరిచారు. ఈ విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించుకునేవారు. వాహన సేవలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి.

● రాజంపేట మండలంలో యల్లంపేట వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదంలో ఉందని భక్తులు చెబుతున్నారు.

బ్యాక్‌వాటర్‌లో వేణుగోపాలస్వామి ఆలయం మునక

అయినా యల్లంపేట గ్రామస్తుల్లో తరగని భక్తిభావం

ఏటా ‘వేణు గోపాలస్వామి కల్యాణం

Advertisement
 
Advertisement
Advertisement