పారిశుద్ధ్య మెరుగుకే స్వచ్ఛపథం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య మెరుగుకే స్వచ్ఛపథం

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

పారిశుద్ధ్య మెరుగుకే స్వచ్ఛపథం దుబాయ్‌లో డ్రైవర్‌ ఉద్యోగాలు 20న బంద్‌ జాతీయ అడ్వెంచర్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

సదుం: పారిశుద్ధ్యం మెరుగుకే స్వచ్ఛపథం కార్యక్రమం అమలుచేస్తున్నట్లు జిల్లా స్వర్ణ గ్రామ అధికారి అమర్‌నాథరెడ్డి తెలిపారు. సదుం మండల కేంద్రంలో స్వచ్ఛపథం కార్యక్రమంలో నిర్వహిస్తున్న పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రతి వారం రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని ఆయన సూచించారు. కల్లూరు రోడ్డులో చెత్తను గ్రీన్‌ అంబాసిడర్లు తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, ఇస్రతుల్లా పాల్గొన్నారు.

సాక్షి, మదనపల్లె: జిల్లాలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని జిల్లా నైపుణ్యాధికారి దాసరి నాగార్జున బుధవారం తెలిపారు. అరబ్‌, దుబాయ్‌ దేశాల్లో టాక్సీ డ్రైవర్‌ ఉద్యోగాల కోసం పదవ తరగతి పాసై, డ్రైవింగ్‌ నైపుణ్యంతో భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికై న వారు యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే వరకు వసతి కల్పించి, లైసెన్స్‌ పొందే ప్రక్రియలో సహకారం అందిస్తామని తెలిపారు. లైసెన్స్‌ పొందిన తరువాత కమిషన్‌ ఆధారిత అధిక ఆదాయ అవకాశాలు ఉంటా యని తెలిపారు. దరఖాస్తులకు ఈనెల 19 ఆఖరని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్‌ దేశంలో హోమ్‌ బేస్డ్‌ కేర్‌గివర్‌ ఉద్యోగాల కోసం 25 నుంచి 45 ఏళ్ల మహిళలు, పురుషులకు ఉపాధి అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 15లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

మదనపల్లె టౌన్‌: దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షల మంది కెమిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ (ఏఐఓసీడి) ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఆ యూనియన్‌ అన్నమయ్య జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్య ప్రకాష్‌, జిల్లా కార్యదర్శి టి. భూషణ్‌ గుప్తా, కోశాధికారి సుబ్రహ్మణ్యం, నటరాజ్‌ తెలిపారు. బుధవారం వారు మదనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ ఈ–ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వటం జరిగిందన్నారు. మందులు అనేవి సాధారణ వినియోగ వస్తువులు కావని, అవి నేరుగా రోగి ప్రాణాలతో ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సాగుతున్న మందుల విక్రయాల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాంటీబయోటిక్స్‌, చెడు వ్యసనాలకు అలవాటు చేసే మందులు సులభంగా లభించడం వల్ల యువత ప్రమాదంలో పడుతోందన్నారు. పెద్ద కంపెనీలు డ్రగ్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలను అతిక్రమిస్తూ భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, దీనివల్ల చిన్న కెమిస్టుల జీవనాధారం దెబ్బతింటోందన్నారు.

మదనపల్లె సిటీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ జిల్లా కుర్సియాంగ్‌లో ఈనెల 11 నుంచి 15వతేదీ వరకు నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ అడ్వెంచర్‌ (సాహస కృత్యాల) శిక్షణా కార్యక్రమంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి నేతృత్వం వహించిన జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ స్లైకింగ్‌, ట్రెక్కింగ్‌, షూటింగ్‌,హైకింగ్‌ అర్చరీ వంటి సాహస కృత్యాల్లో జిల్లా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించి ప్రశంసాపత్రాలు అదుకున్నారన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, సమయస్పూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇలాంటి అడ్వెంచర్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్కౌట్‌మాస్టర్లు ప్రేమ్‌సాగర్‌,మోహన్‌బాబు, గురునాథరెడ్డి, నితిన్‌రెడ్డి, గైడ్‌కెప్టెన్‌ పద్మజ, ఏడు మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement