ఘనంగా గంధ మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గంధ మహోత్సవం

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

మిట్స్‌ ఎంట్రన్స్‌ ఫలితాలు ప్రకటన

పెద్దమండ్యం: పెద్దమండ్యంలో మాసాబీబీ ఉరుసు ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి గంధమహోత్సవం ఘనంగా జరిగింది. రాత్రి జరిగిన గంధం ఊరేగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్‌ విండో ఛైర్మన్‌ కలిచెర్ల సుధాకరరెడ్డి, మాజీ ఎంపీపీ టి. రెడ్డిశేఖరరెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులకు స్థానిక నాయకులు ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ తాజామాజీ సర్పంచ్‌ సోదనపల్లె బాషాలు ఘనంగా స్వాగతం పలికారు. మాసాబావి వద్ద కడప అమీన్‌పీర్‌ దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ ప్రత్యేక ఫాతేహా నిర్వహించారు. పీఠాధిపతికి ఉరుసు నిర్వాహక కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఖవ్వాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, జడ్‌పీటీసీ పీరమ్మ, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డి, తాజా మాజీ సర్పంచ్‌ సోదనపల్లె బాషా, ఎంపీటీసీ మంచూరి జయరాం, కో ఆప్షన్‌ మెబర్‌ ఖాదర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

కురబలకోట; అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం ఈనెల 3 నుండి 9వ తేదీ వరకు 13 సెంటర్లలో ఐదు వేల మందితో నిర్వహించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు ఫలితాలను శుక్రవారం ప్రో చాన్స్‌లర్‌ నాదేళ్ల ద్వారకనాథ్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన ఈ ఫలితాలలో టాప్‌ 20 ర్యాంకులు సాధించిన వారికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. మదనపల్లికి చెందిన ఫఠాన్‌ జుల్పికర్‌ ఖాన్‌ మొదటి ర్యాంకు, పి. రిషిత రెడ్డి రెండో ర్యాంకు, ఎన్‌ రామ్‌ చరణ్‌ రెడ్డి మూడో ర్యాంకు, వి. రుషిక్‌ నాల్గవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొదటి ర్యాంకర్‌కు వంద శాతం ఫీజు స్కాలర్‌ షిఫ్‌ నాలుగేళ్లు అందజేస్తామన్నారు. ర్యాంకు రెండు నుండి ఐదు వరకు 75 శాతం, ర్యాంకు ఆరు నుండి పది వరకు 50 శాతం,11 నుండి 20 ర్యాంకర్‌ వరకు 25 శాతం ఫీజు స్కాలర్‌షిప్‌ అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వీసీ యువరాజ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మారుతీ ప్రసాద్‌ తదితరులు ర్యాంకర్లను అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement