చీనీ తోటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చీనీ తోటల పరిశీలన

May 14 2026 1:01 AM | Updated on May 14 2026 1:01 AM

చీనీ తోటల పరిశీలన

తొండూరు: తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె, గుండ్లమడుగు గ్రామాల్లో బుధవారం విజయవాడ కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్ర ప్రతినిధులు ఎం.పి.గోస్వామి, జేడీ కె.వి. చౌదరి, ఉద్యాన శాఖ అధికారి మల్లేశ్వరరెడ్డిలు సర్వే నిర్వహించి చీనీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చీని తోటల్లో పొలుసు పురుగు అధికంగా ఉండటం గమనించారు. దీంతో చెట్టు వేరు వ్యవస్థ, ఎదుగుదల మందగించటంతో చెట్లు చనిపోతాయన్నారు. చీని చెట్లు దెబ్బ తినకుండా ఉండాలంటే రోజుకు 60లీటర్ల మించి నీరు ఉండకూడదని, వీటి నివారణకు గొనె సంచితో కాండం లేదా చెట్ల బేరడుపై బాగా రుద్దాలన్నారు. దీంతో పాటు పలు సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement