నమో.. నారసింహా | - | Sakshi
Sakshi News home page

నమో.. నారసింహా

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

నమో.. నారసింహా

గుర్రంకొండ: మండలంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను దర్శించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement