ఆగని కేబుల్‌ వైరు చోరీలు | - | Sakshi
Sakshi News home page

ఆగని కేబుల్‌ వైరు చోరీలు

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

రామసముద్రం : మండలంలో కేబుల్‌ వైర్ల చోరీలు వరుసగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఊలపాడులో రైతుల బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు చోరీ కాగా.. శుక్రవారం రాత్రి ఆర్‌.నడింపల్లి పంచాయతీ బొంపల్లి గ్రామంలో పంచాయతీ తాగునీటి బోరు కేబుల్‌ వైర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు అపహరించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం బోరు పనిచేయకపోవడంతో గ్రామస్తులు పరిశీలించగా కేబుల్‌ వైరు చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కేబుల్‌ వైర్లు వరుస చోరీలకు కావడంతో ఈ ఘటనలపై రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement