రోబోటిక్స్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్‌పై అవగాహన

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

కురబలకోట : అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ మొదటి సంవత్సరం బీటెక్‌ విద్యార్థులు ఇండస్ట్రియల్‌ విజిట్‌ కింద మంగళవారం బెంగళూరులోని ట్రెసా మోటార్‌ సంస్థను సందర్శించారు. అక్కడ హ్యుమనాయిడ్‌ రోబోట్ల పనితీరు, కదలిక, నియంత్రణ తదితరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రోబోట్‌తో పరస్పర చర్య తదితర వాటిపై ప్రత్యక్ష అనుభవం పొందారు. ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆటోమేషన్‌, ఏఐ తదితర రంగాలపై కూడా వారికి అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

పీలేరు రూరల్‌ : గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఏటీ నగర్‌లో చోటు చేసుకుంది. అధికారుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. 85 ఏళ్ల వయసు గల వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ శ వంగా గుర్తించి పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది.. మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్‌ సభ్యుల సహకారంతో దహన క్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement