వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై చోటు చేసుకొంది.
వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


